మాటవరసకంటే దేశంలోని జనాలంతా బట్టలన్నీ విప్పేస్తున్నారు..!

Thursday, June 30th, 2016, 11:22:58 AM IST


నాయకులు ప్రజల్లో ఉత్తేజాన్ని, ఉల్లాసాన్ని నింపడానికి, వారిని ప్రేరేపించడానికి సమయానుగుణంగా మాట వరసకి సామెతల్ని, మాటల్ని వాడుతుంటారు. ఆ మాటల్లోని సారాన్ని, ముఖ్య ఉద్దేశ్యాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి తప్ప గుడ్డిగా ఫాలో అవ్వకూడదు. అలా ఫాలో అయితే కొన్ని అగచాట్లు తప్పవు. ప్రస్తుతం ‘బెలారస్’ దేశం అలాంటి పరిస్థితినే చూస్తోంది.

ఆ దేశ అధ్యక్షుడు ‘అలెగ్జాండర్ యరషుక్’ ఆ దేశ ఉద్యోగుల్ని ఉద్దేశించి ‘మీరంతా దేశాభివృద్ధి కోసం బట్టలు విప్పేసి చెమటలు కారేదాకా పనిచెయ్యాలి’ అని అన్నాడు. మామూలుగా ఈ మాటల అర్థం మీరంతా కష్టపడి పనిచేసి దేశాన్ని అభివృద్ధి చేయండి అని. కానీ ఆ దేశ ఉద్యోగులు మాత్రం ఏమాత్రం ఆలోచించకుండా ఆహ్యాక్షుడు చెప్పాడు కదా అని ఒంటిమీదున్న బట్టలన్నీ విప్పేసి దిగంబరంగా ఆఫీసుల్లో, బయట, బ్యాంకుల్లో పని చేస్తున్నారు. అడిగితే మా అధ్యక్షుడే బట్టలిప్పేసి పని చెయ్యమన్నాడు అని సమాధానం చెబుతున్నారు.