ఆ దారుణానికి పాల్పడింది ఈ ముగ్గురేనా..?

Wednesday, March 23rd, 2016, 10:48:40 AM IST


బెల్జియం రాజధాని బ్రెస్సిల్స్ విమానాశ్రయంలో మంగళవారం రోజున రెండు చోట్ల బాంబు పేలుళ్లు జరిగిన సంగతి తెలిసిందే. ఈ బాంబు పేలుళ్లు జరిగే కొద్ది సేపటి ముందు విమానాశ్రయంలో అరబిక్ బాషలో కొంతమంది బిగ్గరగా అరిచినట్టు కొంతమంది ప్రత్యక్ష సాక్షుల సమాచారం బట్టి తెలుస్తున్నది. ఇకపోతే, ఫ్రాన్స్ లో పేలుళ్ళకు పాల్పడిన కొంతమంది ఉగ్రవాదులను ఐదురోజుల క్రితం అక్కడి పోలీసులు పట్టుకున్నారు. దానికి నిరసనగా ప్రశాంతమైన బ్రెస్సిల్స్ నగరంపై ఉగ్రవాదులు దాడులు చేశారు.

ఇక ఇదిలా ఉంటే, ఈ సంఘటన జరిగిన వెంటనే.. బెల్జియం దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. బ్రెస్సిల్స్ నగరంలో రెడ్ అలర్ట్ ప్రకటించి, విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేయడమే కాకుండా.. మెట్రో సర్వీసులను సైతం నిలిపివేశారు. ఇకపోతే, పోలీస్ అధికారులు విమానాశ్రయంలో ముగ్గురు అనుమానితుల ఫోటోలను విడుదల చేసింది. బ్రెస్సిల్స్ విమానాశ్రయంలో పేలుళ్లు జరిపిన వ్యక్తులు గా వీరిని అనుమానిస్తూ.. ఆ దిశగా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.