లక్వీపై భారత్ సీరియస్ – పాక్ హైకమీషనర్ కు సమన్లు జారీ

Monday, December 29th, 2014, 06:17:56 PM IST


ముంబై పేలుళ్ళలో కీలక సూత్రధారికి కరాచి హైకోర్ట్ బెయిల్ మంజూరు చేయడాన్ని భారత్ సీరియస్ గా తీసుకున్నది. పాక్ జైలులో ఉన్న లక్వీకి పాక్ కోర్ట్ బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఉగ్రవాదాన్ని అణిచివేస్తామని చెప్తూనే, మరోవైపు పేలుళ్ళ సూత్రధారికి బెయిల్ ఇవ్వడంతో భారత్ తీవ్రంగా మండిపడింది. అంతర్జాతీయ స్థాయిలో ఒత్తిడి పెచ్చింది. అంతేకాకుండా, లక్వీకి బెయిల్ ఇచ్చే ముందే, పెషావర్ లోని ఓ ఆర్మీ స్కూల్ లో ఉగ్రవాదులు పెట్రేగిపోయి అభం శుభం తెలియని 160మంది చిన్నారనులను పొట్టన పెట్టుకున్నారు. దీంతో, అటు ప్రజలనుంచి పెద్దఎత్తున నిరనసనలు మొదలైయ్యాయి. పాక్ కోర్ట్ బెయిల్ మంజూరు చేస్తే, ప్రభుత్వం ఎంపీఓ పేరుతో లక్వీని మూడునెలల పాటు జైలులోనే ఉంచాలని చూసింది. అయితే, ఇస్లామాబాద్ యాంటి టెర్రరిస్ట్ కోర్ట్ బెయిల్ మంజూరు చేస్తే, ప్రభుత్వం తనను నిర్భంధించదాన్ని సవాల్ చేస్తూ… కరాచి హైకోర్ట్ లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారించిన హైకోర్ట్ ఎంపిఓ ను తిరష్కరించినది. దీంతో లక్వీ విడుదలకు మార్గం సులభం అయింది.

లక్వీ కి బెయిల్ మంజూరు కావడాన్ని సీరియస్ గా పరిగణించిన భారత్ విదేశాంగ శాఖ, పాక్ హై కమీషనర్ కు సమన్లు జారీ చేసింది.