పరిషత్ ఎన్నికల్లో టీడీపీ నేతలు పోటీ చేస్తారు – అఖిల ప్రియ

Tuesday, April 6th, 2021, 08:48:14 AM IST

పరిషత్ ఎన్నికల విషయం లో తెలుగు దేశం పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తెలుగు దేశం పార్టీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. తెలుగు దేశం పార్టీ అధినేత, మాజి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయం లో ఒక స్పష్టత ఇచ్చారు. అయితే ఇప్పుడు పరిషత్ ఎన్నికల్లో పాల్గొనేందుకు తెలుగు దేశం పార్టీ నేతలు సిద్దంగా ఉన్నారు అంటూ భూమా అఖిల ప్రియ చెప్పుకొచ్చారు. కార్యకర్తల అభిప్రాయం తో ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు తెలిపారు. అయితే భూమ అఖిల ప్రియ స్పష్టత తో ఆ వర్గం నామినేషన్లు వేసేందుకు సిద్దం అవుతున్నారు. అయితే టీడీపీ పోటీ లేని చోట నోటా కి ఓటు వెయ్యాలి అంటూ మరో పక్క ప్రచారం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రజల నిర్ణయం ఏదైనా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. మరి ఈ నిర్ణయం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.