భారత్ లో పరిస్థితి చాలా భయానకం గా ఉంది – బైడెన్ వైద్య సలహదారుడు

Wednesday, May 5th, 2021, 08:50:26 AM IST

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. ఊహించని రీతిలో పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అయితే భారత్ లో కరోనా వైరస్ పరిస్తితి పై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రధాన వైద్య సలహాదారుడు, ప్రజారోగ్య నిపుణుడు అయిన డాక్టర్ ఆంథోనీ ఫౌచి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.అయితే కరోనా ను అరికట్టడం కోసం తాత్కాలిక ఆసుపత్రులను నిర్మించాలి అని వ్యాఖ్యానించారు. అయితే ఇందుకోసం సైన్యం తో పాటుగా అన్ని వనరులను సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పుకొచ్చారు. అయితే భారత్ కి ఇతర దేశాలు తమ వైద్య పరికరాలను, ఔషధాలను మాత్రమే కాకుండా సిబ్బంది ను కూడా పంపించి ఆదుకోవాలి అని అన్నారు. అయితే ఈ మహమ్మారి ను అడ్డుకోవాలి అంటే దేశ వ్యాప్తంగా కొన్ని వారాల పాటు లాక్ డౌన్ అమలు చేయాలి అంటూ చెప్పుకొచ్చారు.