బీహార్ ముఖ్యమంత్రి రాజీనామా…!

Friday, February 20th, 2015, 11:35:41 AM IST


బిహార్ రాజకీయం మరోమలుపు తిరిగింది. ఈరోజు సాయంత్రం బిహార్ ముఖ్యమంత్రి జితన్ రామ్ మన్జీ బలపరీక్ష నిరుపించుకోవలసి ఉన్నది. తనకు 140ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్టు మన్జీ గతంలో చెప్పిన విషయం తెలిసిందే. ఇక, బీజేపికూడా మన్జీకి అనుకూలంగా ఓటు వేసేందుకు సిద్దంగా ఉన్నట్టు బహిరంగంగానే ప్రకటించింది. మంత్రి వర్గంలో ఉన్న కొందరు మంత్రులు మన్జీకి అనుకూలంగా ఉన్నారు. ఈ సాయంత్రం బలపరీక్ష ఉన్నది అనగా, ఉదయం మన్జీ గవర్నర్ ను కలిసి రాజీనామా సమర్పించడంతో బీహార్ రాజకీయం మరోసారి వేడెక్కింది. గవర్నర్ సైతం మన్జీ రాజీనామాను ఆమోదించడంతో ఇప్పుడు బిహార్ ముఖ్యమంత్రిగా ఎవరు బాధ్యతలు చేపడతారు అన్నదానిపై ఉత్కంట మొదలైంది.