ఢిల్లీ కంటోన్మెంట్లో బీజేపి హావా

Monday, January 12th, 2015, 07:22:31 PM IST

bjp-in-haryana
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కంటోన్మెంట్ ఎన్నికలు జరిగాయి. ఈ కంటోన్మెంట్ ఎన్నికలలో బీజేపి తన హావాను కొనసాగించింది. మొత్తం ఎనిమిది వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలలో బీజేపి 5 వార్డులను సొంతం చేసుకోగా, ఏఏపీ రెండు, కాంగ్రెస్ ఒక వార్డును సొంతం చేసుకున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరవబోతున్న సమయంలో ఈ వార్తా బీజేపికి ఆనందదాయకమే అని చెప్పవచ్చు. ఇక, ఇది ఇలా ఉంటే, ఉత్తరప్రదేశ్ లోని వారణాసి, లక్నో, ఆగ్రాలలో కూడా కంటోన్మెంట్ కు ఎన్నికలు జరిగాయి. అయితే, ఉత్తర ప్రదేశ్ లో జరిగిన ఈ కంటోన్మెంట్ ఎన్నికలలో బీజేపి ఘోరంగా ఓడిపోయింది. ప్రధాని మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి కంటోన్మెంట్లో ఒక్క వార్డుకుడా గెలవలేక పోయింది. ఇక్కడ 8 వార్డులను స్వతంత్ర అభ్యర్ధులే కైవసం చేసుకున్నారు. కేంద్ర హొమ్ శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న లక్నోలోను అదే పరిస్థితి. ఇక ఆగ్రాలో ఒకే ఒక్క వార్డును బీజేపి గెలుచుకుంటే, ఏడు చోట్ల స్వతంత్రులు గెలుపొందారు.