ఏపీలో బీజేపీ భూస్థాపితం కానుందా..?

Tuesday, May 10th, 2016, 11:20:58 PM IST


బీజేపీ 2014 ఎన్నికల ముందు, ఆ తరువాత నిన్న మొన్నటి దాకా ఏపీ ప్రజల ఆశాదీపం. విభజన భాధ కన్నీరు పెట్టిస్తున్నా నేనున్నానని మాటిచ్చిన బీజేపీని చూసి జనాలు కాస్త ధైర్యం తెచ్చుకుని బీజేపీతో కలిసి రాష్ట్ర కాంగ్రెస్ కు సమాది కట్టేశారు. అడ్డగోలు విభజన చేసినందుకు గాను కాంగ్రెస్ సరైన శిక్షే అనుభవించింది. కానీ ఇప్పుడు బీజేపీ కూడా కాంగ్రెస్ ధోరణే అవలంభిస్తోంది.
కాంగ్రెస్ చేసిన విభజన గాయానికి ప్రత్యేక హోదా అనే మందు రాసి ఉపశమనం కలిగిస్తామని మాటిచ్చి, అ తరువాత విభజన బిల్లు ప్రకారం ఏపీకి ఎలాంటి ప్రత్యేక హోదాలు అవసరం లేదు. అలాగే రెవెన్యూ లోటు కూడా కేంద్రం ఇవ్వనవసరం లేదు. విభజన చట్టంలో అలానే ఉంది కావాలంటే చూసుకోండి అంటూ ప్లేటు పిరాయించింది. దీంతో ప్రజలు ఎన్నికల ముందు విభజన చట్ట చదవలేదా. దాన్ని సవరించి హోదా ఏదో ఇస్తారనే కదా ఓటేసింది. మరిప్పుడు ఈ వెన్నుపోటు ఏంటి. ఇలాగే నాంచితే కాంగ్రెస్ పక్కనే బీజేపీకి వచ్చే ఎన్నికల్లో సమాధి కట్టక తప్పదు అని హెచ్చరిస్తున్నారు.