రాజన్న రాజ్యమంటే దోచుకోవడం, దాచుకోవడమే.. షర్మిలకు బీజేపీ నేత కౌంటర్..!

Saturday, April 10th, 2021, 05:39:04 PM IST

తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్న వైఎస్ షర్మిల ఇందుకు సంబంధించి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. నిన్న ఖమ్మంలో అభిమానులు ఏర్పాటు చేసిన సంకల్ప సభలో మాట్లాడిన వైఎస్ షర్మిల జూలై 8న వైఎస్సార్ జయంతి సందర్భంగా కొత్త పార్టీ పేరు మరియు ఆ రోజే పార్టీ జెండా, అజెండా ప్రకటిస్తామని చెప్పుకొచ్చారు. అయితే అహికార పార్టీ టీఆర్ఎస్ పార్టీపై, బీజేపీలపై షర్మిల నిప్పులు చెరిగారు. బీజేపీ మాటలు చెప్పడం తప్ప చేతల్లో ఏదీ చూపడం లేదని ఎద్దేవా చేశారు. కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ ఇవ్వలేదని, తెలంగాణకు ఇచ్చిన ఏ హామీనీ కేంద్రం నెరవేర్చలేదంటూ మండిపడ్డారు.

అయితే షర్మిల వ్యాఖ్యలకు బీజేపీ నేత ఎన్వీఎస్ ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. రాజన్న రాజ్యమంటే దోచుకోవడం, దాచుకోవడమేనని అన్నారు. జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చింది రాజన్న రాజ్యమేనని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. రాజన్న రాజ్యంలోనే ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు కోర్టుల చుట్టూ తిరిగారని గుర్తుచేశారు. షర్మిల ప్రసంగం సీఎం కేసీఆర్ రాసి ఇచ్చిందేనని విమర్శలు చేశారు. నాగార్జున సాగర్‌లో విచ్చలవిడిగా మద్యం పంచుతున్నారని ఎన్వీఎస్ ప్రభాకర్ ఆరోపించారు.