సీఎం జగన్ జైలుకెళ్ళడం ఖాయం.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..!

Saturday, April 3rd, 2021, 07:38:34 AM IST

ఏపీలో అధికార పార్టీ వైసీపీకి, బీజేపీకి మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఇన్ని రోజులు కేవలం ప్రధాన ప్రతిపక్షం టీడీపీని మాత్రమే టార్గెట్ చేసి విమర్శలు గుప్పించిన వైసీపీ నేతలు ఇప్పుడు బీజేపీనీ టార్గెట్ చేసుకున్నారు. పాండిచ్చేరికి ప్రత్యేక హోదా ఇస్తామని చెబుతున్న కేంద్రం, ఏపీకి ఎందుకు ప్రత్యేక హోదా కుదరదని అంటుందో సమాధానం చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల కోసం బీజేపీ ఎన్ని అసత్య ప్రచారాలైనా చేస్తోందని, ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించిన తరువాతే బీజేపీ నేతలు తిరుపతిలో ప్రచారానికి రావాలని డిమాండ్ చేస్తున్నారు.

అయితే వైసీపీ విమర్శలపై బీజేపీ కూడా కౌంటర్ ఎటాక్ మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే తాజాగా ఏపీ సీఎం జగన్‌పై బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ థియోధర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న జగన్ ఏ క్షణమైనా జైలుకెళ్ళొచ్చు అని, జగన్ బెయిల్ ఏ క్షణమైనా రద్దయ్యే అవకాశం ఉందని అన్నారు. జగన్ హయాంలో రాష్ట్రం ఇప్పటికే సర్వనాశనమైందని, ప్రస్తుతం ఏపీలో అవినీతి, అప్పులే మిగిలాయని ఆరోపించారు. ఏపీలో ప్రత్యామ్నాయంగా బీజేపీ-జనసేన కూటమి బలపడ్డాయి అని అన్నారు.