ఆ యోధుడి బయోపిక్‌లో నటించబోతున్న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్..!

Monday, March 1st, 2021, 05:35:21 PM IST

బీజేపీ ఫైర్ బ్రాండ్, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సినిమాల్లోకి రాబోతున్నారు. ఓ వైపు ఎమ్మెల్యేగా ప్రజల కష్టనష్టాలను తెలుసుకుంటూనే, మరోవైపు గో అక్రమ రవాణాను అడ్డుకుంటున్నారు. వీటన్నిటిలో బిజీగా ఉన్న రాజాసింగ్ శంభాజీ మహారాజ్ బయోపిక్‌లో నటించేందుకు సిద్దమయ్యారు. ఈ సందర్భంగా ఓ ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజాసింగ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ అని ఆయన పాత్రలో నేను నటించడం గర్వంగా ఉందని చెప్పుకొచ్చారు.

అయితే శంభాజీ శివాజీ కంటే డేంజర్ అని శివాజీ మరణించిన తర్వాత ఔరంగజేబు సామ్రాజ్యంపై ఆయన దాడి చేసి 120 కోటలను స్వాధీనం చేసుకున్నారని అన్నారు. అయితే శంభాజీ లుక్ కోసం భారీగా బరువు తగ్గానని తెలుగు, హిందీ, మరాఠీ సహా మొత్తం నాలుగు భాషల్లో సినిమా తీస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం ప్రొడ్యూసర్ కోసం వెతుకుతున్నామని, సినిమా తీసేంత ఆర్థిక స్థోమత తనకు లేదని, ఒకవేళ ఉంటే తానే స్వయంగా శంభాజీ చిత్రాన్ని నిర్మించేవాడినని అన్నారు. శంభాజీ కథ చాలా బలమైనదని, ఈ మూవీ ఖచ్చితంగా హిట్ అవుతుదన్న నమ్మకం తమకుందని చెప్పుకొచ్చారు