చివరికి హైదరాబాదులో రక్తం కూడా కల్తీ అయిపొయింది

Friday, May 20th, 2016, 03:46:44 PM IST


తాగే నీళ్ళు, పీల్చే గాలి అన్నీ కల్తీ అవుతున్న ఈరోజుల్లో మనుషుల శరీరంలోకి ఎక్కించే రక్తం కూడా దారుణమైన కల్తీకి గురవుతోంది. పేరున్న బ్లడ్ బ్యాంకులను ఉపయోగించుకుంటూ ఈ కల్తీ రక్తాన్ని జనాల శరీరాల్లోకి ఎక్కిస్తున్నారు. సుల్తాన్ బజారులో ఉన్న ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో గత సంవత్సర కాలంగా ఈ దందా నడుస్తోంది. అ ఆసుపత్రిలో ఉన్న ల్యాబ్ ఔట్ సోర్సింగ్ ల్యాబ్ టెక్నీషియన్ నరేందర్ ఈ దందాను నడుపుతున్నాడు.

ఇతగాడు ఆసుపత్రిలో రక్తం అందుబాటులో లేనప్పుడు బయటి నుండి రక్తం తెచ్చి ఒక్కో ఫ్యాకెట్లో 250 మి. లీ లు ఉన్న రక్తం నుండి 100 మి. లీ లు సిరంజి ద్వారా బయటకు తీసి అందులో గ్లూకోజ్ కలిపి పేషెంట్లకు 1500 నుండి 2000 రూపాయలకు అమ్ముతున్నాడు. ఈ దందాను గుర్తించిన ల్యాబ్ టెక్నీషియన్ తెలంగాణా వాలంటరీ బ్లడ్ బ్యాంక్ అసోషియేషన్ అధ్యక్షుడు లక్ష్మా రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా అయన ఆసుపత్రిని సందర్శించి అధికారులకు పిర్యాదు చేశారు.

వీడియో కొరకు క్లిక్ చేయండి :