తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై శాసన మండలి చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌పై బండి సంజయ్ ఇష్త్టమొచ్చినట్టు మాట్లాడడం సరికాదని అన్నారు. జనగామ ఘటనకు సంబంధించి ఒక్కో ఊరిలో ఒక్కో డెడ్‌లైన్ పెట్టారని ఎద్దేవా చేశారు. నిజానికి బండి సంజయ్ హెడ్‌లైన్స్ కోసమే డెడ్‌లైన్స్ విధిస్తారని బోడకుంటి విమర్శలు చేశారు.
అంతేకాదు రాష్ట్రంలో చిన్న చిన్నవిషయాలకే అరాచకాలు అలజడులు చేయాలని చూస్తున్నారని, దుబ్బాకలో కూడా అలాగే చేశారని అన్నారు. జనగామలో జరిగిన చిన్న ఘటనకు చలో జనగామా పిలుపునిచ్చారని అన్నారు. పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న బండి సంజయ్ హుందాతనంగా మాట్లాడాలని సూచించారు. పార్టీ సీనియర్ నాయకులు బండి సంజయ్‌ను సరిగ్గా మాట్లాడమని హితవుచెప్పాలన్నారు. రాబోయే రోజుల్లో బీజేపీకి తగిన బుద్దిచెప్తామని అన్నారు.