ఏకంగా 800ల మంది పిల్లల శవాలు బయటపడ్డాయి..!

Thursday, January 28th, 2016, 11:13:03 AM IST


లండన్ లాంక్ షైర్ లోని బ్లాక్ బర్న్ పట్టణంలో రహదారుల నిర్మాణం కోసం చేపడుతున్న తవ్వకాల్లో దాదాపు 800 మంది పిల్లల అస్థిపంజరాలు భయటపడ్డాయి. ఒకప్పుడు ఇది సెయింట్ పీటర్స్ స్మశాన వాటికే అయినా ఒకే చోట అంతమంది చిన్నపిల్లల మృతదేహాలు లభ్యమవడంతో 1800 ల ప్రాంతంలో అసలక్కడ ఏమిజరిగిందనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దీంతో అక్కడి జీవన, పారిశ్రామిక పరిస్థితులపై అధ్యనం జరిపిన హెడ్ లాండ్ ఆర్కియాలజీ నిపుణుడు డేవ్ హెండర్సన్ ఈ భారీ మరణాల గురించిన అసలు విషయాన్ని బయటపెట్టారు.

1821 ప్రాంతంలో బ్లాక్ బరన్ పట్టణమంతా పారిశ్రామికంగా అభివృద్ధి చెంది తీవ్రమైన కాలుష్యంతో నిండి ఉండేదని.. ఈ కారణంగానే అక్కడి పిల్లలు ఊపిరితిత్తుల సంబందిత వ్యాధులతో భాధపడుతూ.. సరైన వైద్యం, మందులు లేక చనిపోయారని తెలిసింది. పైగా ఈ పిల్లలంతా 6, 7 ఏళ్ళ వయసులోపు వాళ్ళే కావటం విశేషం. ఈ బ్లాక్ బర్న్ స్మశాన వాటికలో 1860 ప్రాంతంలో కొత్త శవాలను పూడ్చడానికి ఖాళీ లేక 30 శాతం పాత శవాలను తొలగించారని ఆ ప్రాంత ప్రతినిధి డార్వెన్ తెలిపారు.