రోబో కోసం కండలుపెంచుతున్న అక్షయ్..!

Wednesday, December 30th, 2015, 03:32:56 PM IST


రోబో 2.0.. శంకర్ కలల ప్రాజెక్ట్. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నది. రజినీకాంత్ హీరోగా.. పలుభాషలలో రూపొందుతున్నది. ఈ సినిమాలో విలన్ పాత్రకోసం హాలీవుడ్ హీరో ఆర్నాల్డ్ ను మొదట అనుకున్నారు. అదే విధంగా ప్రచారం కూడా జరిగింది. ఆర్నాల్డ్ కు భారీ రెమ్యునరేషన్ ఇచ్చేందుకు కూడా సిద్దపడ్డారు. కాని, ప్లాన్ బెడిసికొట్టింది. రోబో సినిమాలో చేసేందుకు ఆర్నాల్డ్ ఒప్పుకున్నా.. దానితో పాటు ఆయన కోరిన కోరికలు తీర్చాలంటే.. బడ్జెట్ తడిసిమోపెడు అయ్యేవిధంగా ఉండటంతో.. ఆర్నాల్డ్ ను పక్కకు పెట్టారు.

ఆర్నాల్డ్ ప్లేస్ లో సడెన్ గా బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ను తెరపైకి తీసుకొచ్చారు. అక్షయ్ కుమార్ రోబో 2.0 లో ఆర్నాల్డ్ స్థానాన్ని భర్తీ చేస్తున్నారు. అంటే విలన్ పాత్రలో నటించబోతున్నారన్నమాట. ఇక, అక్షయ్ కుమార్ ఫిబ్రవరి నుంచి 2.0 షూటింగ్ లో పాల్గొంటాడు. విలన్ పాత్రకోసం బరువు పెరగాల్సి ఉన్నది. ప్రస్తుతం అక్షయ్ కుమార్ బరువుపెరిగే ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసం భారిగా కసరత్తు చేస్తున్నారట అక్షయ్.