లక్నోలో ఎముకలు కోరికే చలి

Wednesday, December 24th, 2014, 08:35:47 PM IST


సాధారణంగా చలికాలంలో సిమ్లా, మనాలి, కాశ్మీర్ ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు పడిపోవడం చూస్తుంటాం. కాని, ఈ సంవత్సరం ఆయా ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాలలో సైతం ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఉష్ణోగ్రత కనిష్టస్థాయికి పడిపోయింది. ఎప్పుడు లేనంత తక్కువగా అక్కడ ఉష్ణోగ్రత నమోదయింది. బుధవారం ఉదయం లక్నోలో 2.5డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఇది లక్నో కంటే 0.2 డిగ్రీల తక్కువ. ఈస్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోవడం ఎప్పుడు చూడలేదని ప్రజలు అంటున్నారు. ఇల్లలోనుంచి బయటకు వచ్చేందుకు ప్రజలు జంకుతున్నారు. డిసెంబర్ నెలలో సాధారణంగా లక్నోలో 8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అవుతుంటుంది. అయితే ఈ ఏడాది డిసెంబర్ 20న 5డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, ఈ రోజు అంటే, డిసెంబర్ 24న కనిష్ట స్థాయిలో 2.5డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు.