బిగ్ న్యూస్: బ్రెజిల్ అధ్యక్షుడికి సైతం సోకిన కరోనా..!

Wednesday, July 8th, 2020, 12:32:27 AM IST


ఊహన్ కేంద్రంగా మొదలైన కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి, ప్రపంచ దేశాలను చుట్టు ముట్టింది. తాజాగా బ్రెజిల్ దేశ అధ్యక్షుడిగా ఉన్న జాయిర్ బాల్సో నారో కి కరోనా వైరస్ పాజిటివ్ గా తేలింది. అయితే ఈ విషయాన్ని స్వయంగా తానే మీడియా ద్వారా వెల్లడించారు. అంతేకాక తన ఆరోగ్య పరిస్తితి ఇపుడు నిలకడగా ఉంది అని తెలిపారు. అంతేకాక చికిత్స కోసం హైడ్రాక్సీ క్లోరో క్వీన్ ను మరియు అజిత్రో మైసిన్ లని ఉపయోగిస్తున్న ట్లు ప్రకటించారు. అయితే ఇదివరకే రెండు సార్లు కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయించు కోగా నెగటివ్ గా వచ్చినట్లు తెలుస్తోంది.

అయితే ఆదివారం నాడు ఆరోగ్యం బాగోలేక నీరసం అనిపించగా, సోమవారానికి మరింత ఎక్కువ అయినట్లు తెలుస్తోంది. అయితే జ్వరం తీవ్రత ఎక్కువగా ఉండటం తో పరీక్షలు చేయించుకున్నారు, అపుడు కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. అయితే బ్రెజిల్ దేశం లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అమెరికా తర్వాతి స్థానం లో బ్రెజిల్ దేశం ఉండటం గమనార్హం. అంతేకాక బ్రెజిల్ లో ఇప్పటి వరకూ 16 లక్షల మందికి పైగా కరోనా వైరస్ సొకగ, దాదాపు 65 వేల మందికి పైగా కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రాణాలను కోల్పోయారు.