సరదా కోసం హత్యలు చేసిన నరహంతకుడు

Sunday, December 14th, 2014, 08:03:36 PM IST


బ్రెజిల్ రాజధాని రియో డి జనీరియో ప్రాంతంలో 39 మంది మహిళలను హత్య చేసినట్టు సెయిల్ సన్ జోసె దాస్ ఒప్పుకున్నాడు. తనమీద వచ్చిన ఆరోపణలు నిజమే అని హంతకుడు తెలిపాడు. బ్రెజిల్ లోని ప్రముఖ బ్రాడ్ కాస్టర్ టీవీ గ్లోబో ఈ నరరూప హంతకుడిని ఇంటర్వ్యూ చేసింది. తను 17సంవత్సరాల వయసులో మొదటి హత్య చేసినట్టు చెప్పాడు. ఈ పది సంవత్సరాల కాలంలో ఇప్పటివరకు మొత్తం 39 హత్యలు చేసినట్టు ఒప్పుకున్నాడు. కేవలం సరదా కోసమే ఈ హత్యలు చేసినట్టు తెలియజేశారు. మహిళలను హత్యచేయాలనే కోరికే తన చేత ఈ హత్యలు చేయించిందని జోసె దాస్ తెలిపారు. అది కూడా తెల్లజాతి వారిని మాత్రమేని, నల్లజాతి వారిని కాదని పోలీసులకు తెలిపాడు. బాధితులను దగ్గరి నుంచి పరిశీలించి అనంతరం సమయం చూసి హత్య చేసేవాడని అతను తెలిపినట్లు పోలీసులు తెలిపారు. బుధవారం నోవా హత్య కేసులో అనుమానితుడిగా జోసెని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ విచారణలో విస్తృతపోయో నిజాలు వెలుగు చూసినట్టు పోలీసులు తెలియజేశారు.