మళ్లీ పుట్ట్టిన బ్రూస్ లీ!

Thursday, December 11th, 2014, 06:43:56 PM IST

Bruce-Lee-rebirth-again
సహజంగా మనిషిని పోలిన మనుషులు ప్రపంచ వ్యాప్తంగా ఏడుగురు ఉంటారని అంటారు. అయితే కొందరు తమ కుటుంబ సభ్యుల పోలికతోనో, పూర్వీకుల పోలికతోనో జన్యుపరమైన లక్షణాలను కలిగి ఉంటారు. కాగా మరికొందరు మాత్రం ఎటువంటి రక్త సంబంధం లేకుండానే కొంతమంది పోలికలను కలిగి ఉండి ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటారు. అలంటి వారిలో తాజాగా ఆఫ్ఘనిస్తాన్ కి చెందిన ఒక వ్యక్తి వార్తల్లోకి వచ్చారు.

వివరాలలోకి వెళితే చరిత్రలో సంచలనం సృష్టించిన బ్రూస్ లీ లాంటి వ్యక్తి ఆఫ్ఘనిస్తాన్ పురాతన కట్టడం ఎదురుగా ఫ్లయింగ్ కిక్ ఇస్తున్నట్లు ఉన్న ఫోటో ఇప్పుడు సోషల్ నెట్వర్క్ సైట్ లలో హల్ చల్ చేస్తోంది. కాగా ఆఫ్ఘనిస్థాన్ కు చెందిన అబ్బాస్ అలీ జాదా అనే కుర్రాడు అచ్చం బ్రూస్ లీ లా ఉండడంతో, బ్రూస్ లీ ఫోటో పక్కనే తన ఫోటో పెట్టి ఓల్డ్ డ్రాగన్-న్యూ డ్రాగన్ అని కాప్షన్ ఇచ్చాడు. ఈ ఫోటో సోషల్ సైట్లలో దుమారం రేపడంతో బీబీసీ కూడా ఒక కధనాన్ని ప్రసారం చేసింది. ఇక అబ్బాస్ మాట్లాడుతూ తనకు బ్రూస్ లీ అంటే చాలా ఇష్టమని, ఆయన స్పూర్తితో 14వ ఏట నుండే మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీసు చేసానని తెలిపారు. అలాగే బ్రూస్లీ పోలికలు ఉండడంతో తనకు ఎవరైనా అవకాశం ఇస్తే తన కుటుంబాన్ని మూడు పూటలా పోషించుకుంటానని ఈ ఆఫ్ఘన్ బ్రూస్ స్లీ పేర్కొన్నారు.

వీడియో కోసం క్లిక్ చేయండి