కోల్ కతాలో ఒకటి.. ఢిల్లీలో మరొకటి.. వరసగా

Tuesday, December 22nd, 2015, 02:46:33 PM IST

కోల్ కతాలోని సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా జెట్ విమానాన్ని వెనుకనుంచి వేగంగా వచ్చిన బస్సు ఒకటి డీకొట్టింది. అదృష్టం ఏమిటంటే.. ఎవరికీ ఏమీ కాలేదు. ఎయిర్ ఇండియా జెట్ విమానంలో ఎక్కించ వలసిన ప్రయాణికులను తీసుకొని వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. జెట్ విమానం రెక్కను డీ కొట్టిన సమయంలో వేగం తక్కువగా ఉండటం.. విమానం ఇంజన్ కు కాస్త దూరంలో బస్సు ఆగిపోవడంతో పెను ప్రమాదం నుంచి బయటపడింది. అదే బస్సు వేగం ఎక్కువగా ఉన్నట్టైతే.. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండేదని అధికారులు చెప్తున్నారు. ఇక డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

ఇకపోతే, ఈరోజు ఉదయమే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కు చెందిన విమానం ఒకటి ద్వారకా సెక్టార్ లోని బాడ్పాల గ్రామం వద్ద కూలిపోయింది. రాంచి నుంచి వస్తున్న ఈ విమానంలో ఉన్న పదిమంది మరణించారు. ఇందులో ముగ్గురు విమాన సిబ్బంది కాగ, మిగతా ఏడుగురు సాంకేతిక నిపుణులు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పారు. ఇక, ఈ ప్రమాదం జరిగిన తీరుపై హొమ్ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆరా తీస్తున్నారు.