విశాఖ బాధితులకు కేంద్రం చేయూత

Wednesday, October 22nd, 2014, 11:22:03 AM IST


హుధూద్ తుఫాను కారణంగా విశాఖ నగర జీవనం అస్తవ్యస్తమైన విషయం తెలిసిందే. అయితే, అక్కడ సహాయ చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఐదురోజులపాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడే ఉండి.. సహాయ పునరావాస కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షించారు. ఇక ప్రధాని నరేంద్ర మోడీ కూడా విశాఖలో పర్యటించి తక్షణ సహాయంగా 1000కోట్ల రూపాయలు మంజూరు చేసిన విషయం విదితమే.

కాగ, నేడు కేంద్ర పట్టాణాభివృద్ది శాఖ మంత్రి వెంకయ్యనాయుడు విశాఖలో పర్యటిస్తున్నారు. హుధూద్ తుఫాను కారణంగా ఇళ్లు కోల్పోయిన వారికి కేంద్రం పక్కా ఇళ్ళు కట్టించి ఇస్తుందని వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. విశాఖ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన తెలియజేశారు. వెంకయ్య నాయుడు ఈరోజు రేపు విశాఖలో ఉండి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తారని.. బీజేపి పార్టీ ఓ ప్రకటనలో తెలియజేసింది.