అన్ లాక్ 3.0: కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాలు ఇవే!

Wednesday, July 29th, 2020, 08:26:14 PM IST


కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశం లో లాక్ డౌన్ నుండి అన్ లాక్ వైపుకి దశల వారీగా కేంద్రం మార్గ దర్షకాలని జారీ చేసింది. అన్ లాక్ 2 నడుస్తుందగా, ఇపుడు అన్ లాక్ 3.0 కి సంబంధించిన మార్గ దర్శకాలను విడుదల చేసింది. అయితే రాత్రి పూట కొనసాగుతున్న కర్ఫ్యూ ను ఇక ఎత్తి వేస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాక ఈ మార్గ దర్షకాలు ఆగస్ట్ 31 వరకు కొనసాగుతాయి అని అందులో తెలిపింది.

అయితే జిమ్ లు, యోగా కేంద్రాలు ఆగస్ట్ అయిదు నుండి తెరుచుకొ నున్నాయి అని తెలిపింది. అంతేకాక భౌతిక దూరం పాటిస్తూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకోవచ్చు అని ప్రకటన లో తెలిపింది.

అయితే పాటశాల లు, కళాశాలలు ఇపుడు అపుడే తెరుచుకునే అవకాశం లేదు. వాటి పై ఉన్నటువంటి నిషేదం కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. అంతేకాక మెట్రో రైళ్లు, స్విమ్మింగ్ పూల్స్, సినిమా హాల్స్, ఎంటర్ టైన్మెంట్ పార్క్, బార్స్, ఆడిటోరియం ల పై నిషేదం కొనసాగుతుందని స్పష్టం చేసింది. అంతేకాక సామాజిక, రాజకీయ, క్రీడా, వినోదాత్మక, మత పరమైన కార్యక్రమాల విషయాల్లో కూడా నిషేదం కొనసాగుతుందని తెలిపింది. అయితే కంటైన్ మెంట్ జోన్ లలో మాత్రం ఈ లాక్ డౌన్ ఆగస్ట్ 31 వరకు కొనసాగుతుంది అని తెలిపింది.