వాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం కోసం కేంద్రం కీలక నిర్ణయం

Thursday, April 1st, 2021, 03:55:34 PM IST

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. దాదాపు 70 వేలకు పైగా నేడు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అయితే కరోనా వైరస్ కట్టడికి కేంద్రం బలం గా నమ్ముతున్న నిర్ణయం కరోనా వైరస్ వాక్సిన్ అని చెప్పాలి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా కరోనా వాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం గా జరుగుతోంది. అయితే మరింత వేగవంతం చేసేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ నెలలో అన్ని రోజులు టీకా పంపిణి చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. గెజిటెడ్ సెలవు రోజుల్లోనూ టీకా కేంద్రాలు అందుబాటులో ఉండేలా నిర్ణయం తీసుకుంది. ఆయితే ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం లేఖ రాసింది. వాక్సినేషన్ ప్రక్రియ కోసం తగిన ఏర్పాట్లు చేయాలి సూచించింది. అయితే ఎక్కువ మందికి కరోనా వైరస్ టీకాలు అందించాలనే లక్ష్యం తో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.