కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరొక కీలక ప్రకటన!

Thursday, April 1st, 2021, 09:33:14 AM IST

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై పలువురు విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మేరకు సోషల్ మీడియా వేదిక గా కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ మరొక కీలక ప్రకటన చేశారు. చిన్న మొత్తాల పొదుపు పథకాల పై వడ్డీరేట్లు యధాతథంగా ఉంటాయి అని చెప్పుకొచ్చారు. పొదుపు పధకాల వడ్డీ రేట్లను తగ్గిస్తూ బుధవారం నాడు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే నిన్న తీసుకున్న నిర్ణయం ను ఉపసంహరించుకుంటూ నేడు నిర్ణయం తీసుకోవడం జరిగింది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ వడ్డీ రేటు పై 0.7 శాతం, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ వడ్డీరేటు పై 0.9 శాతం, సేవింగ్స్ డిపాజిట్ల పై 0.5 శాతం తగ్గిస్తున్నట్లు నిన్న పేర్కొనడం జరిగింది. అయితే మళ్ళీ వాటిని ఉపసంహరించుకోవడం తో కేంద్ర ప్రభుత్వం పై నెటిజన్లు స్పందిస్తున్నారు. అయితే 2020-21 త్రైమాసికం ప్రకారం వడ్డీ రేట్లు ఉంటాయి అని తెలపడం పట్ల పలువురు కామెంట్స్ చేస్తున్నారు. పలు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల వేళ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం పట్ల ఘాటుగా విమర్శలు చేస్తున్నారు.