పోలీసులు గ్రేట్!

Tuesday, October 21st, 2014, 09:40:28 AM IST


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడ ఇందిరా మున్సిపల్ స్టేడియంలో మంగళవారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆస్తులు, మహిళల రక్షణకు పోలీసులు అహర్నిశలు కష్టపడుతున్నారని తెలిపారు. అలాగే పోలిసుల విధి నిర్వహణలో విపరీతమైన పనిభారం పడుతుందని, ఆ భారాన్ని తగ్గించేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని పేర్కొన్నారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ పోలీసులు ఆధునిక పరిజ్ఞ్యానాన్ని వినియోగించాలని, ప్రజల విశ్వాసం పెంచేలా పనిచెయ్యాలని సూచించారు. అలాగే దేశంలో పెత్తనం చేయాలని బ్రిటీష్ వారు పోలీస్ వ్యవస్థను తీసుకువచ్చారని, బ్రిటీష్ వారి ప్రవర్తన వల్ల ప్రజలకు ఇప్పటికీ పోలీసులపై నమ్మకం కలగని పరిస్థితి నెలకొందని చంద్రబాబు పేర్కొన్నారు. ఇక దేశం కోసం పోరాడిన జవాన్ల కంటే పోలీసులు గొప్పవారని, పోలీసుల గౌరవాన్ని పెంచేలా ప్రభుత్వం పనిచేస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు.