చంద్రబాబు, కేసీఆర్ లు ఆ విషయంలో మాత్రం ఒకే మాట మీద నిలబడ్డారు..!

Tuesday, February 16th, 2016, 02:20:02 PM IST


ఏపీ, తెలంగాణాలు విడిపొయ్యాక ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ లు అనేక అంశాలపై భిన్నాభిప్రాయాలతోనే ఉండేవారు. ఏకాభిప్రాయానికి రాక అనేక అంశాల్లో వాదనలకు దిగిన సందర్బాలూ ఉన్నాయి. కానీ వీరిద్దరూ ఒకేఒక విషయంలో మాత్రం ఏకాభిప్రాయంతోనే ఉన్నారు. అదే అసెంబ్లీ సీట్ల పెంపు. అటు ఏపీ, ఇటు తెలంగాణాల్లో ప్రస్తుతమున్న అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచాలని ఒక వారం వ్యవధిలోనే ఇరువురు ముఖ్యమంత్రులూ ఢిల్లీలో చర్చలు జరిపారు.

ప్రస్తుతం ఏపీలో 175గా ఉన్న అసెంబ్లీ స్థానాలను 225కు, తెలంగాణలో 119గా ఉన్న సంఖ్యను 153కు పెంచాలని వీరు ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. దీనిపై ఇరు రాష్ట్రాలలోని ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. అసెంబ్లీ స్థానాలను పెంచడం వలన నియోజకవర్గాల్లోని జనాభా సంఖ్య తగ్గి అధికార పార్టీలకు మేలు జరుగుతుందని ప్రతిపక్ష నాయకులు ఎలక్షన్ కమీషన్ కు పిర్యాదు కూడా చేశారు. స్థానాల పెంపు అనేది కేవలం 2026 తరువాత మాత్రామే సాధ్యమవుతుందని వారు తెలిపారు. ఇదిలా ఉండగా ఇద్దరు సీఎం లు మాత్రం ఈ అంశంపై సానుకూలంగా స్పందించాలని ప్రధానిని కోరినట్లు సమాచారం.