చంద్రబాబు మనవడి పుట్టినరోజు ఆహ్వానపత్రిక ఇదేనండోయ్..!

Friday, April 8th, 2016, 10:02:06 AM IST


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి మనవడి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తెలుగుదేశం పార్టీ సిద్దమయింది. తేది ప్రకారం ఇటీవలే నారా లోకేష్ బర్త్ డే వేడుకలను నారావారి పల్లెలో నిర్వహించారు. అయితే, తిది నక్షత్రం ప్రకారం ఈరోజు ఘనంగా విజయవాడలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇక ఇందుకోసం తెలుగుదేశం పార్టీ ఓ ఆహ్వానపత్రికను కూడా విడుదల చేసింది. ఇందులో ఉన్న సమాచారం ప్రకారం, ఈరోజు సాయంత్రం 7 గంటలకు విజయవాడలోని కస్తూరి గార్డెన్స్ లో చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలను నిర్వహించనున్నారు. ఇక, ఇప్పటికే ఆహ్వాన పత్రికలను నాయకులకు, ఇతర ముఖ్యనేతలకు అందజేశారు. ఇక మీడియాకు కూడా ఆహ్వానపత్రికలను అందజేశారు. ఒక్కో ఆహ్వానపత్రికపై ఇద్దరికి ఆహ్వానం ఉంటుందని అందులో పేర్కొనడం విశేషం.