కోవిడ్ రెండవ దశ చాలా ఉదృతంగా ఉంది – చంద్రబాబు

Thursday, May 6th, 2021, 07:38:51 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పై తెలుగు దేశం పార్టీ అధినేత, మాజి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరొకసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అతి తీవ్రమైన కరోనా వైరస్ సమస్యకు ఏపీ మంత్రి వర్గ సమావేశం లో ప్రాధాన్యత కల్పించలేదు అని చంద్రబాబు నాయుడు అన్నారు. అయితే మంత్రి వర్గ సమావేశం లో 33 వ అజెండా గా కరోనా నియంత్రణ ను చేర్చారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే దుబారా కి వేల కోట్ల ఖర్చులు చేస్తూ, ప్రజల ప్రాణాలు కాపాడేందుకు మీన మేశాలు లెక్కిస్తున్నారు అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ తీరు ను ఎండగడుతూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ప్రజల ప్రాణాలు, ఆరోగ్యం కంటే ఈ ప్రభుత్వానికి ఏమీ ఎక్కువ అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే ఈ మహమ్మారి విషయం లో ప్రభుత్వానికి సూచనలు ఇవ్వడానికే పోలిట్ బ్యూరో సమావేశం నిర్వహించినట్లు చంద్రబాబు నాయుడు అన్నారు. కోవిడ్ రెండవ దశ చాలా ఉదృతంగా ఉందని చంద్రబాబు నాయుడు అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుండి పొరుగు రాష్ట్రాలకు వెళ్ళే వారికి నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నారు అని తెలిపారు. అయితే తమ ప్రజలకు ఇబ్బంది వస్తుంది అనే, తమిళనాడు ఒడిశా రాష్ట్రాలు ఏపీ పట్ల ఆంక్షాలను అమలు చేస్తున్నారు అంటూ చెప్పుకొచ్చారు. అయితే కొత్త ఎన్440కే కర్నూల్ లో ప్రారంభం అయి దేశ వ్యాప్తంగా వ్యాప్తి చెందుతుంది అని నిపుణులు చెబుతుంటే అసలు ఆ వైరస్ లేదని బుకాయిస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే వెంటిలేటర్లు, ఆక్సిజన్ పడకల కొరత లేదని అసత్యాలు చెబుతున్నారు అంటూ మండిపడ్డారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం కి ఎన్నో వనరులు ఉన్నాయి అని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందని చంద్రబాబు నాయుడు అన్నారు. మరి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యల కి వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.