వైసీపీ గెలిస్తే అక్రమాలకు లైసెన్స్ ఇచ్చినట్లే – చంద్రబాబు

Monday, April 12th, 2021, 07:33:48 AM IST

తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక ప్రచారం లో భాగంగా రాపూరు, వెంకటగిరి లో నిర్వహించిన రోడ్ షో లో మాట్లాడారు. ఈ మేరకు అధికార పార్టీ వైసీపీ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక లో ఓటడిగే అర్హత వైసీపీ కి లేదని చంద్రబాబు నాయుడు అన్నారు. అయితే డబ్బు తీసుకొని ఓట్లేస్తే హక్కులు కోల్పోతారు అంటూ చంద్రబాబు నాయుడు అన్నారు అయితే ఈ మేరకు వాలంటీర్ వ్యవస్థ పై సైతం సంచలన వ్యాఖ్యలు చేశారు.

బెదిరించే వాలంటీర్లను ఎదిరించాలి అంటూ అక్కడి ప్రజలకు సూచించారు. అయితే ఈ తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక లో వైసీపీ గెలిస్తే అక్రమాలకు లైసెన్స్ ఇచ్చినట్లే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంపీ లు అంతా రాజీనామా చేయాలనీ, తెలుగు దేశం పార్టీ కి చెందిన ముగ్గురు ఎంపీ లు కూడా రాజీనామా చేస్తారు అంటూ చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. అప్పుడు ఢిల్లీ వెళ్లి పోరాటం చేయొచ్చు అంటూ చెప్పుకొచ్చారు. అయితే వైసీపీ అధికారం లోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా గతంలో తాము చేసిన అభివృద్దే కనిపిస్తుంది అని వ్యాఖ్యానించారు. అయితే సంక్షేమ కార్యక్రమాలకు వైసీపీ ప్రభుత్వం స్వస్తి పలికింది అంటూ విమర్శలు గుప్పించారు. వైసీపీ ప్రభుత్వం కార్పొరేషన్ లను నిర్వీర్యం చేసింది అంటూ సంచలన ఆరోపణలు చేశారు. అయితే టీడీపీ మరియు వైసీపీ పాలన పై చర్చకు ధైర్యం ఉందా అంటూ వైసీపీ ప్రభుత్వానికి సవాల్ విసిరారు చంద్రబాబు నాయుడు. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యల పట్ల వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.