టీడీపీ హయాంలో నీతివంతమైన పాలన అందించాం – చంద్రబాబు

Wednesday, April 14th, 2021, 07:26:31 AM IST

తెలుగు దేశం పార్టీ అధినేత, మాజి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికార పార్టీ వైసీపీ పాలనా విధానం పై, సీఎం జగన్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక ప్రచారం నేపథ్యం లో నెల్లూరు జిల్లా గూడూరు లో నిర్వహించిన రోడ్ షో లో చంద్రబాబు నాయుడు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో మద్యం ధరలను పెంచి ప్రజలను దోచుకుంటున్నారు అని సంచలన ఆరోపణలు చేశారు. తెలుగు దేశం పార్టీ హయాంలో నీతివంతమైన పాలన అందించాం అని వ్యాఖ్యానించారు. అయితే రాజకీయాల్లో రూపాయి ఆశించకుండా నిప్పులా బతుకుతున్నా అని చెప్పుకొచ్చారు. అయితే తన పై తప్పుడు కేసులు పెట్టి వేదించేందుకు ప్రయత్నం చేస్తున్నారు అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

అయితే చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్న తీరు పట్ల వైసీపీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాళ్ల దాడి నుండి చేస్తున్న వ్యాఖ్యల పట్ల గట్టి కౌంటర్ ఇస్తున్నారు. తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక లో వైసీపీ గెలుపు ఖాయం అని, అందుకోసమే డ్రామాలు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే అధికార పార్టీ వైసీపీ అభ్యర్ధి గురుమూర్తి కు తిరుపతి లో భారీ మెజారిటీ వస్తుంది అంటూ మరొక పక్క వైసీపీ నేతలు చెప్పుకొస్తున్నారు.