అవమానాల పాలు చేసి చులకనగా చూస్తున్నారు – చంద్రబాబు

Friday, February 26th, 2021, 08:40:03 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ముగిసిన పంచాయతీ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గం నుండి వైసీపీ ఘన విజయం సాధించింది. ఎక్కువ స్థానాలు విజయం సాధించడం తో వైసీపీ లోకి చేరికలు కూడా జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కి చెందిన పలువురు కీలక నేతలు పార్టీ ను వీడి, అధికార వైసీపీ లోకి చేరుతున్నారు. అయితే కుప్పం నియోజకవర్గం చంద్రబాబు కి సొంత నియోజక వర్గం కావడం తో పరిస్థితుల పై, కార్యకర్తల తో సమీక్ష సమావేశం కోసం కుప్పం వెళ్ళారు. అయితే రోడ్ షో ద్వారా పర్యటించిన చంద్రబాబు కి అడుగడుగునా టీడీపీ కార్యకర్తలు తమ సమస్యలను విన్నవించుకున్నారు. పలు చోట్ల కార్యకర్తలు తమ అవేదన వ్యక్తం చేస్తూ, ఎన్నికల వేళ జరిగిన సంఘటనలను వివరించారు. అయితే చంద్రబాబు నాయుడు పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

గతాన్ని తవ్వుకుంటే ముందుకు వెళ్ళలేము అని చంద్రబాబు నాయుడు అన్నారు. అంతర్గత విమర్శలతో బలహీన పడతాము అని అన్నారు.కొత్త రక్తాన్ని పోరాడే వారిని ముందుకు తీసుకు వద్దాం అని వ్యాఖ్యానించారు. అయితే 14 సంవత్సారాలు ముఖ్యమంత్రి గా చేసిన తనను అవమానాల పాలు చేసి చులకనగా చూస్తున్నారు అని చంద్రబాబు నాయుడు అవేదన వ్యక్తం చేశారు. నాకు ముఖ్యమంత్రి పదవి అవసరమా అంటూ చెప్పుకొచ్చారు. అయితే ప్రజల కోసం తన పోరాటం అని చెప్పుకొచ్చారు. అధికార పార్టీ తీరు పట్ల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మద్యపాన విధానం పై చంద్రబాబు నాయుడు ఘాటు విమర్శలు చేశారు.