మందుపాతరలకే భయపడలేదు…గులకరాళ్లకు జంకుతానా? – చంద్రబాబు

Tuesday, April 13th, 2021, 03:02:27 PM IST

తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక నేపథ్యం లో తెలుగు దేశం పార్టీ అధినేత, మాజి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరొకసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదీ శాశ్వతం కాదు అనేది తిరుపతి ఉపఎన్నిక ఫలితాలతో నిరూపితం అవుతుంది అని చెప్పుకొచ్చారు. కొత్త ఏడాది లో సమస్యలకు భయపడకుండా ధైర్యంగా ఎదుర్కోవాలని చంద్రబాబు నాయుడు అన్నారు. అయితే రాష్ట్ర సమస్యల పై పోరాడి, ప్రజలను కాపాడుకొనే బాధ్యత తెలుగు దేశం పార్టీ పై ఉందని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. తిరుపతి అభివృద్ది తెలుగు దేశం పార్టీ తోనే సాధ్యం అయింది అని తెలిపారు.

అయితే ఈ మేరకు చంద్రబాబు నాయుడు ఘాటు వ్యాఖ్యలు గుప్పించారు. నా సభ పై రాళ్ళు వేస్తారా అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మందుపాతరలకే భయపడలేదు అని, గులకరాళ్ళకు జాంకుతానా అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే తిరుపతి లో శాంతిభద్రతలకు ఆటంకం ఏర్పడితే తిరుమల పైన ప్రభావం ఉంటుంది అని తెలిపారు. అయితే చెప్పుకోడానికి ఏమీ లేకనే వైసీపీ తెలుగు దేశం పార్టీ పై దాడులు చేస్తోంది అంటూ చెప్పుకొచ్చారు. తిరుపతి తెలుగు దేశం పార్టీ కి కంచుకోట అంటూ చెప్పుకొచ్చారు.1983 నుండి తిరుపతి లో ఎక్కువ సార్లు తెలుగు దేశం పార్టీ దే విజయం అంటూ చంద్రబాబు నాయుడు అన్నారు. అయితే చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యల పట్ల వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.