ఒక్క అవకాశం ఇచ్చి మోసపోయారు.. జగన్‌పై చంద్రబాబు ఫైర్..!

Wednesday, April 14th, 2021, 12:15:49 AM IST


తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీఎం జగన్‌పై నిప్పులు చెరిగారు. ఒక్క అవకాశం అని చెప్పి జగన్ ప్రజలను మోసం చేశారని, ఇక ఇదే ఆయనకు చివరి అవకాశం కావాలని చంద్రబాబు అన్నారు. కరోనాను ప్రభుత్వం కంట్రోల్ చేయలేకపోయిందని, కరోనాతో సహజీవనం చేయాలని, బ్లీచింగ్ పౌడర్ వేస్తే పోతుందని జగన్ జనజీవన వ్యవస్థని నాశనం చేశాడని వ్యాఖ్యానించారు.

అయితే కరోనా సమయంలో మద్యం షాపులు తెరిచారని, చదువులు చెప్పాల్సిన ఉపాధ్యాయులను మద్యం దుకాణాల వద్ద కాపలాపెట్టాడని విమర్శలు గుప్పించారు. కమీషన్ల దండుకోవడం కోసం సొంత మనుషులకు ఇసుక అమ్మకాలను కట్టబెట్టారని, ప్రస్తుతం రాష్ట్రంలో ఇసుక దొరికే పరిస్థితి లేదని, ఇసుక ధరలకి రెక్కలొచ్చాయని చంద్రబాబు అన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పేదల కోసం బ్రహ్మాండంగా ఇళ్లు నిర్మించామని, రెండేళ్ళుగా వైసీపీ ఎన్ని ఇళ్లు కట్టించిందో చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.