ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలని బహిష్కరిస్తున్నాం – చంద్రబాబు

Friday, April 2nd, 2021, 05:38:29 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ మేరకు తెలుగు దేశం పార్టీ అధినేత పలు కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎన్నికలు అప్రజాస్వామికం గా మారాయి అని, పరిషత్ ఎన్నికల తేదీలను మంత్రులు ముందే ఎలా చెబుతారు అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే కొత్త రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వచ్చి రాగానే పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే పరిషత్ ఎన్నికల్లో ఎన్నికల కమిషనర్ రబ్బర్ స్టాంప్ గా మారారు అంటూ చంద్రబాబు నాయుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రస్తుతం రాజ్యాంగ స్ఫూర్తి కి వ్యతిరేకం గా ఎన్నికలు జరుగుతున్నాయి అని, పరిషత్ ఎన్నికలు సజావుగా జరుగుతాయి అనే నమ్మకం లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే ఈ పరిస్థితుల్లో కఠిన నిర్ణయాలు తీసుకొక తప్పదు అంటూ చంద్రబాబు నాయుడు అన్నారు. అప్రజాస్వామిక నిర్ణయాల్లో భాగస్వాములం కాలేము అని చంద్రబాబు నాయుడు అన్నారు. అయితే తమ పార్టీ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల ను బహిష్కరిస్తుంది అంటూ సంచలన ప్రకటన చేశారు. తెలుగు దేశం పార్టీ నిర్ణయాన్ని ప్రజలు అర్దం చేసుకుంటారు అని భావిస్తున్నాం అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఎన్నికల బహిష్కరణ పట్ల బాధ, అవేదన ఉందని ఆయన అన్నారు.