మా వాళ్ళ పై తప్పులు కేసులు పెడుతున్నారు…డీజీపీ కి చంద్రబాబు లేఖ

Sunday, February 28th, 2021, 09:34:28 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి అని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే వైసీపీ నేతలు కూడా అదే తరహాలో చెబుతూ వస్తున్నారు. అయితే ప్రతి పక్ష తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం ఇందుకు భిన్నంగా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తాజాగా తమ వాళ్ళ పై తప్పుడు కేసులు పెడుతున్నారు అని, వాటి పై చర్యలు తీసుకోవాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ కి బాబు లేఖ రాశారు. పంచాయతి ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం పలు చోట్ల తెలుగు దేశం పార్టీ సానుభూతి పరుల పై పోలీసులు కేసులు నమోదు చేశారు అని అన్నారు.

అయితే తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం, ఇల్లాపల్లి పంచాయతీ లో సర్పంచ్ గా గెలిచిన వైసీపీ అభ్యర్ధి విజయోత్సవ ర్యాలీ నిర్వహించి, టీడీపీ మద్దతు దారులను ఇబ్బందులకు గురి చేయడం తో పాటుగా వారి పై తప్పుడు కేసులు పెట్టించారు అని లేఖ లో పేర్కొన్నారు. అయితే దాడి చేసిన వారి పై కేసులు పెట్టకుండా, గాయపడిన బాధితుల పై పోలీసులు కేసులు బనాయించారు అని వ్యాఖ్యానించారు.అయితే తమ పార్టీ నేతలు ఒత్తిడి చేశాక పోలీసులు దాడి చేసిన వారి పై కేసులు నమోదు చేశారని, ఇప్పుడు కేసు ఉపసంహరించుకోవాలి అంటూ బాధితులను పోలిసులు మరియు వైసీపీ నేతలు బెదిరిస్తున్నారు అని అన్నారు. అయితే పోలీసులు నిష్పాక్షికంగా వ్యవహారించేలా చూడాల్సిన బాధ్యత డీజీపీ దే అని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేలా చూస్తారని ఆశిస్తున్నా అంటూ చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అయితే మరొకసారి బాబు రాసిన లేఖ పట్ల చర్చలు జరుగుతున్నాయి. దీని పై డీజీపీ మరియు వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.