డబ్బు సంపాదించడం సులువే!

Tuesday, April 21st, 2015, 03:08:52 PM IST


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం ముస్సొరీలోని లాల్ బహదూర్ ఐఏఎస్ అకాడమీలో ట్రైనీ ఐఏఎస్ లను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాసేవ చెయ్యాలనుకునే వారే సివిల్స్ కు వస్తారని పేర్కొన్నారు. అలాగే కష్టపడి పనిచేసేవారికి డబ్బు సంపాదించడం సులువేనని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ దేశంలోని తెలివైన విద్యార్ధులంతా సివిల్స్ కు పోటీ పడతారని తెలిపారు. అలాగే సింగపూర్, హాంకాంగ్, దక్షిణ కొరియా, చైనా దేశాలు మాత్రమే రెండంకెల గణాంకాల అభివృద్ధిని సాధించాయని, ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలో ఇండియా కూడా ఆ ఘనతను సాధిస్తుందనే నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక భారతదేశంలో మూడు దశాబ్దాల తరువాత నరేంద్రమోడీ ఆధ్వర్యంలో భాజపాకు పార్లమెంటులో పూర్తి మెజారిటీని ప్రజలు ఇచ్చారని చంద్రబాబు తెలిపారు.