చెప్పిన పనిని 125 రోజుల్లోనే చేసి చూపిన చంద్రబాబు

Wednesday, June 29th, 2016, 09:01:02 AM IST


రాష్ట్రం విడిపోయి నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు ముందున్న అతి పెద్ద సవాల్ రాజధాని నిర్మాణం. అదేమంత సామాన్యమైన విషయం కాదు. అక్కడ గనుక పొరపాటు జరిగితే ప్రభుత్వానికి భవిష్యత్తుండదు. ఆ సున్నితమైన అంశాన్నే ఆసరాగా తీసుకున్న ప్రతిపక్షాలు రాజధాని నిర్మాణం జరగబోయే వెలగపూడి గ్రామంలో బాబు ప్రభుత్వం రియల్ దణ్డా చేస్తోందని, అమరావతిని వాళ్ళ అక్రమాలకు అడ్డాగా చేసుకుందని, బాబు చెప్పిన గడువులో, బడ్జెట్ లో రాజధాని నిర్మాణం అసాధ్యమని అన్నారు. ఒక దశలో జనాలు కూడా అదే నిజమని అనుకున్నారు.

కానీ బాబు మాత్రం వేటినీ పట్టించుకోలేదు. భూసేకరణ, రైతులను ఒప్పించడం, ప్రణాళిక రచించడం వంటివి పనుల మీదే దృష్టి పెట్టారు. ఫిబ్రవరి 17న వెలగపూడిలో సచివాలయ నిర్మాణానికి శంఖుస్థాపన చేసి ఈరోజు బుధవారం అనగా 125 రోజుల్లోనే పక్కా ప్రణాళికతో ఎన్ని ఆటంకాలొచ్చినా పనులు ఆపకుండా రాత్రి పగలు పనిచేసి, చేయించి ఎల్ అండ్ టీ సంస్థకి తోడు ఆర్ ఎండ్ బీ ఇంజనీర్లను నియమించి మంత్రి నారాయణ పర్యవేక్షణలో 5వ బ్లాక్ లోని 50వేల చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న కింది అంతస్థుని అన్ని వసతులతో పూర్తి చేసి ఈరోజు మధ్యాహ్నం ప్రారంభ ముహుర్తాన్ని కూడా ఫిక్స్ చేశారు. బాబు చూపిన ఈ కార్య దీక్షతో ప్రజల్లో ఈయన రాజధాని నిర్మాణాన్ని ఖచ్చితంగా పూర్తి చేయగలడు అన్న నమ్మకాన్ని కలిగించారు.