నేడు ముంబైకి చంద్రబాబు!

Monday, March 2nd, 2015, 10:11:37 AM IST


రాష్ట్ర విభజన నేపధ్యంగా విడివడిన నవ్యాంధ్ర ప్రదేశ్ కు పెట్టుబడులు రాబట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశంలోని పలు ప్రముఖ నగరాలలో, విదేశాలలో పర్యటనలను చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ నేపధ్యంగా దేశ ఆర్ధిక రాజధాని ముంబైకి నేడు చంద్రబాబు పయనమవుతున్నారు. కాగా ముంబైలో సిటీ బ్యాంకు ఏర్పాటు చేస్తున్న పెట్టుబడిదారుల సమావేశంలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించనున్నారు.

ఇక ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమల స్థాపనకు అవకాశాలు, పెట్టుబడిదారులకు తామిస్తున్న ప్రోత్సాహకాల గురించి చంద్రబాబు సమావేశంలో ప్రసంగించనున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడిదారులకు కల్పిస్తున్న సౌకర్యాలతో పాటు నిరంతర విద్యుత్ తదితర అంశాలపై చంద్రబాబు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ను ఇవ్వనున్నారు. కాగా ఇప్పటికే పలు విదేశాలలో పర్యటించిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులను సాధించడంలో సఫలీకృతమైన సంగతి తెలిసిందే.