ఆదర్శ్ కుంబకోణంలో చవాన్ కు ఎదురుదెబ్బ

Wednesday, November 19th, 2014, 04:51:05 PM IST


మహారాష్ట్రలో అతిపెద్ద కుంబకోణం అయిన ఆదర్శ్ సొసైటీ కుంబకోణంలో విషయంలో తనకు మినహాయింపు ఇవ్వాలని కోరిన ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ కు బాంబే హై కోర్టు లో చుక్కెదురయింది. అశోక్ చవాన్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండగా ఈ కుంబకోణం జరిగింది. దీనిపై అప్పట్లో సిబిఐ దర్యాప్తు చేసింది. దీంతో.. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా అశోక్ చవాన్ ను తొలగించి కాంగ్రెస్ అధిష్టానం పృద్విరాజ్ చౌహాన్ ను ముఖ్యమంత్రిని చేసింది.

అయితే… ఈ కుంబకోణం కేసులో అశోక్ చవాన్ పై దాఖలు చేసిన చార్జ్ షీట్ నుంచి ఆయన పేరును తొలగించాలని సిబిఐ బాంబే హైకోర్టు ను కోరింది. దీనిపై స్పందించిన కోర్టు… పేరును తొలగించేందుకు నిరాకరించింది. అంతేకాకుండా… ఈ విషయంపై సుప్రీమ్ కోర్టుకు వెళ్లేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. అందుకోసం నాలుగు వారల గడువును ఇచ్చింది. ఈ నాలుగు వారాలలో ఏమైనా అభియోగాలు ఉంచే చెప్పాలని… అలాగే.. ఈ నాలుగు వారాలలో ఆయనపై ఎటువంటి విచారణ చేపట్టకుడదని కూడా కోర్టు స్పష్టం చేసింది.