అఫ్జల్ గురును ఉరి తీయకుండా ఉండుంటే బాగుండేదట..!

Thursday, February 25th, 2016, 05:35:16 PM IST


మాజీ ఆర్ధిక మంత్రి చిదంబరం జేఎన్ యూ సమస్యపై మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అఫ్జల్ గురు విషయంలో సరైన న్యాయం జరగలేదని.. అతని అంశంపై ప్రభుత్వం మరొక్కసారి ఆలొచించుంటే బాగుండేదని ఆయన అన్నారు. ఉమర్ ఖలీద్ పై వస్తున్న వార్తలపై స్పందించిన ఆయన ‘ అఫ్జల్ గురు కేసును కేంద్రం సరిగ్గా విచారించలేదు. అతని విషయంలో కాస్త క్షమాపణ చూపి మరణ శిక్షను జీవిత ఖైదుగా చేసుంటే బాగుండేది’ అన్నారు.

అఫ్జల్ గురు 2001 పార్లమెంట్ పై జరిగిన దాడిలో ప్రధాన నిందితుల్లో ఒకరు. ఈ దాడిలో సుమారు 6గురు ఢిల్లీ పోలీసులు, ఇద్దరు పార్లమెంట్ సెక్యూరిటీ గార్డులు మరణించారు. ఈ కేసులో అఫ్జల్ గురు 2013 ఫిబ్రవరి 9న ఉరితీయబడ్డాడు. ఉరికి ముందు రాష్ట్రపతిని క్షమాబిక్ష కోరగా రాష్ట్రపతి దానిని తిరస్కరించారు. ఇదంతా జరిగింది యూపీ ప్రభుత్వ హయాంలోనే. అప్పుడు చిదంబరమే ఆర్ధిక మంత్రిగా ఉన్నారు. అప్పుడు ఏమీ మాట్లాడని ఆయన ఇప్పుడు ప్రభుత్వం అఫ్జల్ గురు విషయంలో సరిగ్గా వ్యవహరించలేదనటం ఆశ్చర్యకరం.