అభిమానుల పట్ల చియాన్ విక్రమ్ ప్రేమ.. కాదు కాదు అంతకు మించి

Monday, February 22nd, 2016, 06:24:31 PM IST


హీరో చియాన్ విక్రమంటే ఆయన అభిమానులకు ఏంతో ప్రేమ.. కాదు కాదు అంతకు మించిన ఏదో అనుభూతి. ఆయనకూ అంతే అభిమానులంటే ఎంతో ఇష్టం. ఈ విషయమే ఇటీవల జరిగిన ఏషియా నెట్ అవార్డ్స్ 2016 ఫంక్షన్ లో ఋజువైంది. అవార్డుల ఫంక్షన్ కు హాజరైన విక్రం ముందు వరుసలో కూర్చొని ఉండగా ఎక్కడి నుంచి వచ్చాడో ఒక అభిమాని వచ్చి ఆయన్ను అమాంతం కౌగిలించేసుకున్నాడు. దీంతో అవాక్కైన ఆయన సెక్యూరిటీ సిబ్బంది ఆ అభిమానిని అక్కడ నుండి పక్కకు లాగేసే ప్రయత్నం చేశారు.

కానీ విక్రమ్ ఆ అభిమాని కళ్ళల్లో ఉన్న నిజమైన ప్రేమను చూసి తన సెక్యూరిటీని వారించి అభిమానిని దగ్గరకు తీసుకున్నాడు. దాంతో ఆనందం పట్టలేని ఆ అభిమాని మరోసారి విక్రమ్ ను కౌగలించుకుని.. ముద్దు కూడా పెట్టేసుకుని ఆనందంతో కన్నీటి పర్యంతమయ్యాడు. ఆ అభిమాని అంత చేస్తున్నా విక్రమ్ అతన్ని నిలువరించలేదు. చివరిలో ఆ అభిమానితో ఓ సెల్ఫీ ఫోటో కూడా దిగి అతన్ని మరింత సంతోషపెట్టాడు. దీంతో ఆ అభిమాని ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇటీవలే టెలీకాస్ట్ అయిన ఈ అవార్డుల ఫంక్షన్ కార్యక్రమంతో ఈ దృశ్యాలన్నీ బయటికొచ్చాయి. ఇది చూసి విక్రమ్ అభిమానులే కాకుండా ప్రతి ఒక్కరూ ఫ్యాన్స్ పట్ల విక్రమ్ ఆదరణకు ఫిదా అంటున్నారు.