మెస్ కుర్రాడు సివిల్స్ సాధించాడు!

Saturday, July 4th, 2015, 09:30:44 PM IST


సాధించాలన్న తపన ఉండాలి గాని విజయాన్ని అడ్డుకునే శక్తి దేనికీ లేదని ఒక యువకుడు ప్రపంచానికి చాటి చెప్పాడు. ఈ మేరకు మెస్ లో పనిచేసే ఒక యువకుడు ఐఏఎస్ పరీక్షల్లో విజయం సాధించి తన సత్తా నిరూపించుకున్నాడు. ఇక వివరాలలోకి వెళితే ముస్సోరీలో ఉన్న ‘లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమి ఆఫ్ అడ్మినిస్ట్రేషన్’ లో ఐఏఎస్ కు ఎంపికైన వారు ట్రైనింగ్ పొందుతారన్న విషయం తెలిసిందే. అయితే ఆ అకాడమీలో ఉన్న మెస్ లో రవి అనే కుర్రాడు పనిచేసేవాడు. కాగా అలాంటి రవి సివిల్ సర్వీసెస్ లో నేడు విజయం సాధించాడు. ఈ మేరకు నేడు విడుదలైన సివిల్స్ ఫలితాలలో రవికి 184వ ర్యాంకు వచ్చింది. ఇక కృషి ఉంటే దేన్నైనా సాధించవచ్చని, పేదరికాన్ని సైతం జయించ వచ్చని, టాలెంటు ఏ ఒక్కరి సొత్తు కాదని రవి నిరూపించి ఎందరికో స్పూర్తిగా నిలిచాడు అనే దానిలో ఎటువంటి సందేహం లేదు.