తిరుపతి ఉప ఎన్నిక ప్రచారానికి సీఎం జగన్ దూరం.. కారణం అదే?

Sunday, April 11th, 2021, 03:00:10 AM IST

ఏపీలో తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా ఈ నెల 14న జరగాల్సిన ఉప ఎన్నిక ప్రచార సభను సీఎం జగన్ రద్దు చేసుకున్నారు. ఈ మేరకు తిరుపతి ప్రజలకు సీఎం జగన్ బహిరంగ లేఖ రాశారు. గడిచిన 24 గంటల్లో ఏపీలో మొత్తం 2765 కరోనా కేసులు వచ్చాయని అందులో చిత్తూరులో 496 కేసులు, నెల్లూరులో 296 కేసులు వచ్చాయని అంతేకాకుండా నలుగురు కరోనాతో మృతి చెందారని లేఖలో తెలిపారు. అయితే తాను సభకు హాజరైతే వేలాదిగా జనం తరలివస్తారని, కరోనా కేసులు మరింత పెరిగే అవకాశం ఉందని అందుకే ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తాను తిరుపతి పర్యటనను రద్దు చేసుకుంట్టు లేఖలో తెలిపారు.

అయితే నేను వ్యక్తిగతంగా వచ్చి ప్రచారం చేసి మిమ్మల్ని ఓటు అడగకపోయినా ప్రతి కుటుంబానికి కలిగిన లబ్దికి సంబంధించిన వివరాలతో ఇంటింటికి అందేలా ఉత్తరం రాశానని మంచి చేస్తున్న మన ప్రభుత్వానికి నిండు మనసుతో గుండె నిండా ప్రేమతో వైసీపీకి ఓట్లు వేసి గతంలో బల్లి దుర్గాప్రసాద్ అన్నకు ఇచ్చిన మెజారిటీ కన్నా సోదరుడు గురుమూర్తిని అధిక మెజారిటీతో గెలిపించాలని ఆశిస్తున్నట్టు సీఎం జగన్‌ తిరుపతి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.