హాట్ టాఫిక్: రేపు ఢిల్లీకి వెళ్ళనున్న సీఎం జగన్..!

Tuesday, March 2nd, 2021, 10:38:21 PM IST


ఏపీ సీఎం జగన్ మరోసారి ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ రోజు రాత్రికి లేదా రేపు ఉదయం హస్తినకు పయనం కానున్నారు. అయితే ఏపీ సీఎంవో ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌ షా, పలువురు కేంద్ర మంత్రుల అపాయింట్‌మెంట్‌ కోరినట్టు తెలుస్తుంది. అయితే గత జనవరిలో ఢిల్లీకి వెళ్ళిన సీఎం జగన్ హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. దాదాపు గంటకు పైగా సాగిన ఆ భేటీలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు ఆలయాలపై దాడులు, జమిలీ ఎన్నికలు తదితర అంశాల గురుంచి చర్చించినట్టు తెలుస్తుంది.

అయితే ఇప్పుడు మరోసారి సడెన్‌గా సీఎం జగన్ ఢిల్లీకి వెళుతుండడంపై సర్వత్రా చర్చ మొదలయ్యింది. అయితే ముఖ్యంగా రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలోనే సీఎం జగన్ ఢిల్లీ వెళుతున్నారన్న ప్రచారం జరుగుతుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమ ప్రభావం విశాఖ గ్రేటర్ ఎన్నికలపై పడే అవకాశం ఉందని దీనిపైనే ప్రధానంగా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటితో పాటు పోలవరం పెండింగ్ నిధులు, హైకోర్టు తరలింపు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.