హైలైట్స్ : లాక్ డౌన్ సడలింపు పై సీఎం కేసీఆర్ మీడియా సమావేశం

Monday, April 20th, 2020, 12:10:56 AM IST

తెలంగాణ రాష్ట్రం లో మే 7 వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తూ సంచలన ప్రకటన చేసిన సీఎం కేసీఆర్

ఈ కఠిన సమయంలో తల్లిదడ్రుల సమస్యలు దృష్టిలో ఉంచి స్కూల్ ఫీజులు పెంచవ ద్దు. ట్యూషన్ ఫీజులు నెలవారీగా వసూలు చేయాలి అని సూచించారు.

డెలివరీ బాయ్స్ వలన కరోనా వైరస్ సోకుతుండటంతో స్విగి, జోమతో సేవలను రద్దు చేశారు.

ప్రతి కుటుంబానికి 1500 రూపాయల నగదు, రేషన్ అందజేస్తాం

తెలంగాణలో ఇప్పటివరకు కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 858

గచ్చిబౌలి స్టేడియంనీ కరోనా వైరస్ ప్రత్యేక ఆసుపత్రి గా ఉపయోగిస్తాం.

రాష్ట్రాలకు కావల్సిన వెసులు బాటును కేంద్రం కల్పించాలి. తాత్సారం చేయకుండా చర్యలు తీసుకోవా లి

ప్రజలు ప్రభుత్వం కలిసి పని చేస్తేనే కరోనా వైరస్ ను అరికట్ట గలం

రాష్ట్రాలకు ఎఫ్ అర్ బీ ఎం పెంచాలని కోరాం.

మే 4 నుండి విమాన సేవలు కూడా అనుమతి ఇవ్వం.

మనదేశంలో వ్యవసాయం నిర్లక్ష్యం చేయొద్దు అని నరేంద్ర మోడీ కి చెప్పాను.

కరోనా కు నిర్దిష్టమైన మందు లేదు.

అనుకున్న దిశగా కాళేశ్వరం ప్రాజెక్టు పరుగులు తీస్తుంది.

ఆహార పరిశ్రమలను కొనసాగించే అవసరం చాలా ఉంది.

అత్యవసరమైన పరిస్తితుల్లో బయటికి రావాలి. ప్రజల శ్రేయస్సు కోసం కఠిన నిర్ణయాలు తీసుకున్నాం.

ఎలాంటి ప్రభుత్వ సహాయం కావాలన్నా 100 కి డయల్ చేయండి.

మే 7 వరకు శుభకార్యాలకు అనుమతులు లేవు.

ఎరువులు నిల్వ చేయడానికి ఫంక్షన్ హాల్స్ నీ వాడుకొమ్మని కాలెక్టర్ లకు ఆదేశాలు ఇచ్చాం.

రాబోయే రోజుల్లో వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యత.

ఇప్పటివరకు 50 వేల వాహనాలు సీజ్ చేశాం

రైతాంగం పై ఉన్న శ్రద్ద వలన రైతుల పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది.అన్ని పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. వరి,మొక్కజొన్న, మొక్కజొన్న తక్కువ ధరకు పోయిన కొంట ది అని సీఎం కేసీఆర్ అన్నారు.

తక్కువ ధరకు అమ్ముకొని రైతులు నష్టపోకుండా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది.వ్యవసాయం, మార్కెటింగ్ అధికారుల శాఖ సమన్వయం తో పని చేస్తుంది.

రైతులు గుమి కుడకుందా మే నెలలోనే ఎరువులు సర్కార్ నుండి కొనుగోలు చేయండి. మే 5 నుండి ఎరువులు కొనుగోలు చేయండి.

మే నెల కు సంబంధించిన ఆన్ని ఫిక్స్డ్ ఛార్జ్ లని పరిశ్రమలు చెల్లించాల్సిన అవసరం లేదు. వాటన్నిటినీ రద్దు చేశాం

ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఆదాయపు పన్ను మే 30 వరకు చెల్లించవచ్చు.

మే నెలలో లబ్ది దారులు అందరికీ ఫించను చెల్లిస్తాం.

మే నెలలో కూడా 1500 రూపాయలు ప్రతి తెల్ల రేషన్ కార్డు దారుడుకి, మే నెల మొదటి నుండి రేషన్, సరుకులు అందించాలని ఆదేశించాం

విద్యా సంస్థలు నెలవారీగా ట్యూషన్ ఫీజులు చెల్లించుకోవా లి, ప్రభుత్వ ఆదేశాలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం

కరోనా కట్టడి విషయంలో ఇప్పటివరకు ఇచ్చిన మద్దతు అలానే కొనసాగాలి అని కోరుకుంటున్నా. అధికారులు కంటెన్మెంట్ జోన్ లని బాగా పర్యవేక్షిస్తున్నారు.

ఇంటి అద్దెలు మూడు నెలల వరకు తీసుకోవద్దు అంటూ ఇంటి యజమానులను కోరిన కేసీఆర్.. ఇది రిక్వెస్ట్ కాదు. ఇంటి అద్దెలు మూడు నెలల వరకు తీసుకోవద్దు అంటూ ఇంటి యజమానులను కోరిన కేసీఆర్.. ఇది రిక్వెస్ట్ కాదు.

గత నెలలో ఇచ్చిన వేతనలనే ఉద్యోగులకు ఈ నెల కూడా ఇస్తాం. పెన్షనర్లకు 75 శాతం వేతనాలు చెల్లిస్తాం.

ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు, సర్పంచులు అందరూ కరోనా వైరస్ నివారణ కొరకు చాలా సేవ చేస్తున్నారు. అయితే ఏ ఒక్కరూ కూడా ఉపవాసం ఉండకుండా చూడాలి.

రేపటినుండి అనగా ఏప్రిల్ 20 నుండి ఫుడ్ డెలివరీ చేయడానికి స్విగీ, జోమతో లాంటి వారికి అనుమతి లేదు.

ఎలాంటి పండగలైనా ఇళ్లలోనే జరుపుకోవాలి. రంజాన్ అయినప్పటికీ ఎలాంటి సామూహిక ప్రార్థనలకు అనుమతి లేదు.

మే 3 వరకు కేంద్ర చెప్పినట్లుగానే లాక్ డౌన్ రాష్ట్రంలో కొనసాగుతుంది. అంతేకాక లాక్ డౌన్ మే 7 వరకు కొనసాగుతుంది అని వ్యాఖ్యానించారు. మే 7 వరకు లాక్ డౌన్ యదావిధిగా అమలు లో ఉంటుంది. అయితే మే 5 న మరొకసారి పరిస్థితిని సమీక్షించి నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో వైరస్ సోకి మరణించిన వారి శాతం 2.44 గా ఉంది.

అయితే రాష్ట్రంలో మే 1 వరకు కరోనా వైరస్ కేసుల సంఖ్య తగ్గే పరిస్తితి లేదు.

కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కానీ జిల్లా రాష్ట్రంలో ఇప్పటివరకు 4 జిల్లాలు ఉన్నాయి. అయితే కరోనా వైరస్ సోకిన వ్యక్తుల కు చికిత్స అందించడం జరుగుతుంది. వారి ఆరోగ్య పరిస్తితి నిలకడగా ఉంది.

కరోనా వైరస్ కేసుల సంఖ్య ఎనిమిది రోజుల కొకసారి పెరుగుతూ ఉన్నాయి. గతంలో లాక్ డౌన్ నిబంధనలు అలానే కొనసాగుతాయి.

ఈ నెల 20 తర్వాత రాష్ట్రంలో ఎలాంటి సడలింపు లు ఉండవు. కేంద్ర ప్రభుత్వం సడలింపు ప్రకటించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం లో సడలింపు లు ఉండవు అని తేల్చి చెప్పిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.