కోవిడ్ టీకా వేయించుకున్న సీఎం వైఎస్ జగన్

Thursday, April 1st, 2021, 01:31:38 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం నాడు ఉదయం గుంటూరు లో కొవిడ్ టీకా వేయించుకున్నారు. భారత్ పేట లోని ఆరో లైన్ లో ఉన్నటువంటి 140 వ వార్డ్ సచివాలయం లో సీఎం జగన్ ఉదయం రిజిస్ట్రేషన్ చేయించుకొని అక్కడే టీకా వేయించుకున్నారు. టీకా వేయించుకున్న అనంతరం వైద్యుల పర్యవేక్షణ లో కొంత సేపు ఉన్నారు. అయితే వైద్య సిబ్బంది తో, సచివాలయ సిబ్బంది తో సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడారు. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యం లో నేటి నుండి 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ కూడా వాక్సిన్ వేయించుకొనేందుకు అవకాశం కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. సీఎం జగన్ మోహన్ రెడ్డి టీకా పై గతం లో పలు కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.