నిర్మాతగా మారుతున్న స్టార్ కమెడియన్?

Thursday, March 12th, 2015, 05:18:18 PM IST


టాలీవుడ్ లో నవ్వుల రారాజుగా వెలుగొందుతున్న ప్రముఖ కమెడియన్ అలీ త్వరలో నిర్మాతగా అవతారం ఎత్తబోతున్నట్లు తెలుస్తోంది. కాగా బాల నటుడిగా సినీ రంగంలోకి ప్రవేశించిన అలీ అటు తర్వాత అంచలంచెలుగా ఎదిగి హీరో స్థాయికి చేరుకున్నారు. అటుపై కొంతకాలం హీరోగా చెలామణి అయ్యి తాను నమ్ముకున్న హాస్యానికే ప్రాధాన్యతనిచ్చి తిరిగి హాస్యపాత్రలను చేస్తున్నారు అలీ.

అయితే ఎప్పటి నుండో చిత్ర నిర్మాణంఫై మక్కువతో ఉన్న అలీ ఇప్పుడు ప్రొడ్యూసర్ అవతారం ఎత్తనున్నారని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే అలీ నిర్మాణ బాధ్యతలు చేపడుతున్న చిత్రంలో ప్రముఖ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్నారన్న పుకార్లు కూడా ఇండస్ట్రీలో షికార్లు చేస్తున్నాయి. ఇక తనతో నటించిన కమెడియన్ బండ్ల గణేష్ ను ప్రముఖ ప్రొడ్యూసర్ ను చేసిన పవన్, తనతో ఎన్నో సినిమాలలో సహ నటుడిగా చేసిన, మంచి మిత్రుడైన అలీని కూడా స్టార్ ప్రొడ్యూసర్ స్థాయిలో కూర్చోబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారంటూ సమీప వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. మరి ఈ వార్తల్లో నిజం ఏదైనప్పటికీ నటుడిగా మంచి మార్కులు సంపాదించుకున్న అలీ నిర్మాతగా కూడా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని ఆశిద్దాం.