విశ్లేషణ : రాజధాని ముసుగులో జగన్ భారీ అవినీతి..అక్కడ నుంచే మొదలు.!?

Tuesday, December 24th, 2019, 10:08:40 AM IST

ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో మూడు రాజధానులు అంటూ ప్రాంతాల వారీగా విడిపోయి కొట్టుకుంటున్న సంగతి మనం గత కొన్ని రోజుల నుంచి చూస్తూనే ఉన్నాము.వైసీపీ నేతలు తమకు ఏమి పట్టనట్టుగా మూడు రాజధానులు అంటూ ఓ సంచలన ప్రకటన చేసేసి ఊరుకున్నారు.కానీ సామాన్య ప్రజలు మాత్రం అందుకు ఏకీభవించలేకపోతున్నారు.అయితే జగన్ చేసిన ఈ మూడు రాజధానుల ప్రకటన వెనుక భారీ అవినీతి ప్లాన్ ఉందని రాజకీయ వర్గాల్లో ఇప్పుడు మరో విషయం సంచలనంగా మారింది.

కేవలం ఒక్క రాజధాని అయితే తాను చెప్పిన “మన ప్లేట్ లో బిర్యానీ మనమే తినొచ్చు” అనేది సాధ్యం కాదని అనుకున్నారో ఏమో అందుకే తనకంటూ ఇంకో రెండు రాజధానులు కలుపుకుంటే ఇంకా బాగా దండుకోవచ్చు గతంలో టీడీపీ నేతలు తాము ప్రజలపై ఇన్వెస్ట్ చేసినదానికి రాజధాని భూములు ముందుగానే కొనుక్కొని లాభాలు పొందాలని చూసారు.మరి వాళ్ళు మాత్రమే లాభం పొందితే ఎలా జగన్ ను నమ్మి ఎన్నికలకు ఒక్కో ఎమ్మెల్యేకు ఎంపీ 30 నుంచి 50 కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళు కూడా లాభపడాలి కదా అందుకు జగన్ వేసిన ప్రణాళికలో భాగమే ఈ మూడు రాజధానుల ప్రతిపాదన అని అంటున్నారు.

అయితే జగన్ ఈ ప్రకటన చెయ్యడం వెనుక భారీ ప్లానింగే ఉందని కూడా వినిపిస్తుంది.అయితే దానికి ముందు జగన్ ప్రతిపక్షంలో ఉన్నపుడు చెప్పిన మాటలను మనం గుర్తు తెచ్చుకోవాలి.ఇప్పుడు బయటకేమో అభివృద్ధి కేవలం ఒక దగ్గరే ఉంటే మిగతా ప్రాంతాలు ఎలా అభివృద్ధి చెందుతాయని ఇప్పుడు అంటున్నారు.కానీ గతంలో ప్రతిపక్షంలో ఉన్నపుడుసంపూర్ణంగా టీడీపీ ప్రవేశ పెట్టిన అమరావతి రాజధాని అంశాన్ని వైసీపీ పార్టీ తరపున పూర్తిగా సమర్ధిస్తున్నాని 30 వేల ఎకరాల్లో రాజధాని నిర్మాణం జరగాలని అసెంబ్లీ సాక్షిగా జగన్ ఆన్ ది రికార్డు మాట్లాడారు.

ఇది నిజం కాదా?మరి అప్పుడు గుర్తుకు రాని అభివృద్ధి ఇప్పుడు మాత్రమే ప్రాంతాల వారీగా మూడు కీలకమైన చోట్ల ఎందుకు గుర్తుకు వచ్చింది?అన్నది వైసీపీ వారు ఓసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి.అయితే ఈ మూడు రాజధానుల అంశం చర్చకు వచ్చిన ప్రతీ సారి కూడా ఏదొక సంచలన నిజం బయటకు వస్తూనే ఉంది.ప్రస్తుతం రాష్ట్రంలో ఏర్పడుతున్న పరిణామాలను దారి తప్పించడంతో పాటుగా జగన్ తన సంబంధీకులు మరియు పార్టీ నేతలు ఆర్ధికంగా బలపడేందుకు ఈ మూడు రాజధానుల ప్రస్తావన ఇప్పుడు చేసినట్టు తెలుస్తుంది.

దీనికి వ్యూహం జగన్ అధికారంలోకి వచ్చిన రెండు నెలలకే మొదలయ్యింది అని అమరావతిలో అయితే తాము ఖర్చు పెట్టిన దానికి లాభాలు రావని రెండేళ్ల క్రితమే ఏదైతే పోతుందని అనుకున్నారో దానికి నాలుగింతలు సంపాదించేలా మనం అధికారంలోకి వచ్చాక చేస్తానని మాటిచ్చిన జగన్ తన పార్టీ నేతలకు ఇచ్చిన మాట ప్రకారమే ఈ ప్లాన్ సిద్ధం చేసారా అని అనిపిస్తుంది.ఇక్కడే ఓ విషయం గమనించాలి.జగన్ అమరావతికి మద్దతే అని చెప్పి ఐదేళ్ల క్రితం చెప్పారు.కానీ ఈ మన ప్లేట్ లో మన బిర్యానీ అనే కథ మాత్రం ఇంకా ఎన్నికలకు రెండేళ్లు ఉందనగానే చెప్పారు అంటే రెండేళ్లలోనే జగన్ మనసు మారిపోయింది.

లేక ఏపీ ప్రజలను మోసం చెయ్యడానికే బయట ఒకటి లోపల ఒకటి మాట్లాడారో వారికే తెలియాలి.సరే ఇవన్నీ పక్కన పెడదాం ఇప్పుడు అసలు విషయానికి వచ్చినట్టయితే జగన్ చెప్పిన బిర్యానీ కథకు నాంధి విశాఖ నుంచే మొదలు కాబోతుందని రాజకీయ వర్గాల్లో ఇపుడు చర్చకు వచ్చింది.అందుకోసమే అధికారంలోకి వచ్చాక బొత్సతో మెల్లగా రాజధానిపై మారుతుందేమో అని ముందుగానే మాట్లాడించి చిన్న అలజడి రేపారు.దానిలో భాగంగా ఇప్పుడు మూడు రాజధానుల ప్రస్తావనను తీసుకొచ్చారు.

సో ఇది ముందే ప్రీ ప్లానెడ్ అని చెప్పాలి.అలాగే నాలుగు నెలల క్రితమే విశాఖలో జగన్ సంబంధీకులు కానీ పార్టీ నేతలు కానీ భారీగా విశాఖలో 39 వేల ఎకరాలను ముందుగానే కొనుగోలు చేసేశారని ఇది కూడా ప్లానింగ్ లో భాగమే అని అంతే కాకుండా సముద్ర తీరంలో లభించే అపారమైన ఖనిజ సంపద మీద కూడా వారి దృష్టి పడిందని అందుకే విజయసాయి రెడ్డి ఈ మధ్య విశాఖలో భీమిలి తీరాన మాట్లాడుతు వల్లమాలిన ప్రేమను ఒలకబోసారని చెప్పొచ్చు.

అలాగే భీమిలిలో జగన్ నివాసానికి ఇప్పటికే భూమి కూడా తీసుకున్నారని ఇదంతా జగన్ మాస్టర్ ప్లానే అని రాజకీయ వర్గాల్లో ఈ అంశం వైరల్ అవుతుంది.అయినా మన రాజకీయ నాయకులు అధికారం కోసం వేల కోట్లు ఖర్చు పెట్టి సొంతం అయ్యాక ఇలాంటివి చెయ్యడం మానేసి కేవలం ప్రజా సేవే చేస్తారు అని అనుకోవడం వారిని గుడ్డిగా ఎప్పటికీ నమ్మి మోస్తూ ఉండి మీవోడు తింటే మావోడు తినొద్దా అంటూ చెత్త మాటలు మాట్లాడే అర్ధ జ్ఞ్యానులు తమకు జరుగుతున్న నష్టాన్ని గ్రహించకుండా ఉన్న వాళ్ళు ఉన్నంత వరకు ఈ సమాజం ఇలాగే ఏడుస్తుంది.