కాంగ్రెస్ నేతలు ‘మోదీని, స్మృతీ ఇరానీని’ ఎంత మాటన్నారు..!

Monday, December 28th, 2015, 07:36:58 PM IST

కాంగ్రెస్ నేతలు అదికార పార్టీని విమర్శించే పనిలో పడి విలువలను మర్చిపోయి రోజురోజుకూ దిగజారిపోతున్నారు. నిన్న అసోం కాంగ్రెస్ నేతలు మాట్లాడిన మాటలే అందుకు నిదర్శనాలు. అసోం లో జరిగిన ఓ బహిరంగ సభలో మాట్లాడిన కాంగ్రెస్ నేత ‘నిలమోని సేన్ డెకా’ మాట్లాడుతూ ‘కొన్ని కొన్ని సందర్బాలు చూస్తుంటే కేంద్ర మంత్రి స్మృతీ ఇరాని ప్రధాని మోదీకి రెండో భార్యగా వ్యవహరిస్తున్నట్లుంది’ అన్నారు. అనంతరం స్మృతీ ఇరానీ విద్యార్హతలను ప్రశ్నించారు.

అలాగే మరో అసోం కాంగ్రెస్ ఎమ్మెల్యే రూప్ జ్యోతి కుర్మి కూడా దాదాపుగా మోదీ పై ఇలాంటి ఆరోపణలనే చేసింది. దీంతో బీజేపీ జనరల్ సెకరెట్రీ రామ్ మాధవ్ మాట్లాడుతూ ఓ మహిళ నాయకురాలిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలాంటి ఆరోపణలు చేయటం అసహ్యంగా ఉంది. ఇది వాళ్ళ దిగజారుడు రాజకీయానికి నిదర్శనం. వెంటనే కాంగ్రెస్ పార్టీ వాళ్ళపై చర్యలను తీసుకోవాలి’ అన్నారు.