సీఎం కేసీఆర్ కి రేవంత్ బహిరంగ లేఖ…రాష్ట్రం లో హెల్త్ ఎమర్జెన్సీ విధించాలి!

Monday, June 29th, 2020, 08:35:13 AM IST

కరోనా వైరస్ నివారణ చర్యలు రాష్ట్రంలో సరిగ్గా లేవనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. పూర్తి స్థాయిలో కరోనా వైరస్ నివారణకు దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రం లో హెల్త్ ఎమర్జెన్సీ విధించాలి అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కొద్దీ టెస్టుల్లో 32.1 శాతం కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి అని గుర్తు చేశారు.అయితే రాష్ట్రం లో కరోనా వైరస్ ఏ స్థాయిలో కరాళ నృత్యం చేస్తుందో ఈ శాతాలే నిదర్శనం అని వ్యాఖ్యానించారు.

వీఐపీ ప్రాణాలకు ఇస్తున్న విలువ పేద, మధ్య తరగతి ప్రజల ప్రాణాలకు ఇవ్వడం లేదు అని, ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళడం కంటే స్మశానం కి వెళ్ళడం మేలు అన్న అభిప్రాయానిక ప్రజలు వస్తున్నారు అని లేఖలో పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క సలహా ఇస్తే ఎగతాళి చేశారు అని వ్యాఖ్యానించారు. పారా సిట్మాల్ వేసుకొంటే పోతుంది, వేడి నీళ్లు తాగితే కరోనా వైరస్ పోతుంది అని ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా మంత్రులు కూడా మాట్లాడారు అని వ్యాఖ్యానించారు.

టీమ్స్ ఆసుపత్రి విషయం లో రాష్ట్ర ప్రభుత్వం హడావిది తప్ప ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు అని రేవంత్ రెడ్డి నిలదీశారు. ట్రేస్, టెస్ట్, ట్రీట్ విధానం ను అనుసరించాలని చెబుతున్న వినిపించు కోవడం లేదు అని అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటి అయినా నిపుణులతో కమిటీ వేయించి అఖిల పక్ష సమావేశం నిర్వహించి సూచనలు తీసుకోవాలి అని కోరారు.